ఇండియన్ ఎకనామిక్ కాన్క్లేవ్-2024కు సంబంధించి న్యూస్‌ను ప్రచారం చేయడం, ఎపిసోడ్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు ప్రచారం కల్పించడానికి టైమ్స్ న్యూస్ నెట్‌వర్క్‌కు ప్రభుత్వం రూ.1.77 కోట్లు విడుదల చేసింది. ఇండియన్ ఎకనామిక్ కాన్క్లేవ్-2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పార్నర్గా ఉంది. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేసినందుకు ఏపీ ప్రభుత్వం టైమ్స్ సంస్థకు ఈ నిధులు అందిస్తోంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలని సమాచార శాఖ డైరెక్టర్‌ను ఆదేశించారు.