ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడే అర్హత వైసీపీకి లేదని టి. ఎన్. ఎస్. ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కురుబ జగదీశ్ అన్నారు. ఎస్. కే. యూ లో శుక్రవారం.
ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం విద్యార్థుల ఫీజులను పెండింగ్ లో పెట్టి ఇప్పుడు ఫిబ్రవరి 5న 'ఫీజు పోరు' అనే కార్యక్రమంతో కపటనాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా ఉపాధ్యక్షుడు కప్పల నరేశ్, పలువురు టి. ఎన్. ఎస్. ఎఫ్ నేతలు పాల్గొన్నారు.