ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దారుణమైన ర్యాగింగ్‌తో బాలుడి ఆత్మహత్య

national |  Suryaa Desk  | Published : Fri, Jan 31, 2025, 08:25 PM

పదిహేను రోజుల క్రితమే బడిలో చదువుతున్న ఓ బాలుడు.. పాఠశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తాము నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోని 26వ అంతస్తు నుంచి కిందకు దూకగా.. మూడో అంతస్తు బాల్కనీలో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అయితే కుమారుడి మృతికి కారణం ఏంటో తెలుసుకునేందుకు ఆ తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేయగా.. దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా బాలుడు.. తోటి విద్యార్థుల ర్యాగింగ్ వల్లే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. ఈక్రమంలోనే మృతుడి తల్లి డీజీపీకి లేఖ రాశారు. తన దగ్గరున్న ఆధారాలను కూడా సమర్పించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


కేరళలోని ఏర్నాకులం త్రిప్పునితురలో ఉన్నరాజ్నా పీఎంకు 15 ఏళ్ల కుమారుడు మిహిర్ ఉన్నాడు. ప్రస్తుతం మిహిర్ గ్లోబర్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంటున్నాడు. అయితే ఎప్పటిలాగే బడికి వెళ్లిన మిహిర్.. జనవరి 15వ తేదీన ఇంటికి చేరుకున్న వెంటనే తమ అపార్ట్‌మెంట్‌లోని 26వ అంతస్తుకు వెళ్లాడు. ఆపై అక్కడి నుంచి దూకేయగా.. 3వ అంతస్తులోని బాల్కనీలో పడి ప్రాణాలు కోల్పోయాడు. విషయం గుర్తించిన స్థానికులు రాజ్నాకు సమాచారం అందించగా.. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. కానీ అతడు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని తెలుసుకుని రాజ్నాతో పాటు ఆమె భర్తు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


 పోస్టుమార్టం తర్వాత మహిర్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. కానీ రాజ్నా మనసులో మాత్రం తన కుమారుడు మిహిర్ ఎందుకు చనిపోయాడో తెలుసుకోవాలనే కోరిక ఎక్కువైంది. ఎంతో ధైర్యంగా ఉండే అతడు ఇంత దారుణానికి పాల్పడడం వెనుక ఏదో పెద్ద కారణమే ఉంటుందని భావించి భర్తకు విషయం చెప్పింది. ఈక్రమంలోనే వీరిద్దరూ మిహిర్ స్నేహితులు, తరగతి పిల్లలను ఆరా తీయడం ప్రారంభించారు. ఈక్రమంలోనే వారు చెప్పిన అనేక దారుణమైన విషయాలు విని షాక్ అయ్యారు.


ముఖ్యంగా మిహిర్‌ను కొంత మంది చాలా కాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని తెలుసుకున్నారు. మిహిర్ రంగు తక్కువగా ఉండడం, చూసేందుకు బాగాలేకపోవడంతో.. తోటి విద్యార్థులే ర్యాగింగ్ చేసేవారని గుర్తించారు. బాలుడు చనిపోవడానికి ముందు పలువురు విద్యార్థులు అతడిని బాత్రూంలోకి తీసుకు వెళ్లి టాయిలెట్లు నాకించారని, ఆపై ఫ్లష్ ఆన్ చేసి తడిపారని అతడి స్నేహితులు చెప్పారు. ఈక్రమంలోనే అవమానం భరించలేక మిహిర్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని తెలపగా.. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.


మిహిర్ తరగతి పిల్లలతో పాటు అతడి స్నేహితులు చెప్పిన విషయాలను స్క్రీన్ షాట్లుగా తీసిన రాజ్నా వెంటనే డీజీపీ సహా ముఖ్యమంత్రి కార్యలయానికి లేఖ రాశారు. తన కుమారుడిని ర్యాగింగ్ చేసి దారుణంగా హింసించి, అతడి చావుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అలాగే అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను కూడా షేర్ చేశారు. ఈక్రమంలోనే త్రిప్పునితురలోని హిల్ ప్యాలెస్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com