ఏపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర పలు కీలక విషయాలపై చర్చించారు. మహానాడు ను కడప జిల్లాలో నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే వైసీపీ హయంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో చేసిన తప్పులను సరిదిద్దాలని నిర్ణయించినట్లు తెలిపారు. మరికొన్ని కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం.