ధర్మవరానికి చెందిన ఖాజాబీ (65) అనే వృద్ధురాలు కూలి పని కోసం ఓబుల నాయన పల్లి గ్రామానికి శుక్రవారం వెళ్లింది. పని ముగించుకుని తిరిగి ఆటోలో ఇంటికి వస్తూ ఉండగా ఓబుల నాయన పల్లిలోని చర్చి వద్ద ఖాజాబీ ఆటోని మరొక ఆటో ఢీకొనింది.
దీంతో ఖాజాబీకి కాలుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఖాజాబీను చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.