అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులుగా శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.... ‘2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్‌లో అన్ని అసెంబ్లీ స్థానాలు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ కావాలి. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి చేసిన సీఎంగా వైయస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్రంలో పోర్టులు, మెడికల్ కాలేజీలు కట్టిన ఘనత వైయస్ జగన్‌కే దక్కుతుంది. అనకాపల్లిలో గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత వైయస్ జగన్‌ది. నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ కూడా వైయస్ఆర్‌సీపీ హయాంలోనే వచ్చింది అని తెలియజేసారు.