దివ్యాంగుల పింఛన్లు పెంచుతామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి నేతలు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వకపోగా, సదరం సర్టిఫికెట్స్ పేరుతో వారిని వేధించడంతో పాటు, ఉన్న పెన్షన్లు కూడా పీకేసే కుట్రకు తెర తీశారని వైయస్ఆర్‌సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కిరణ్‌రాజ్ ఆక్షేపించారు. ప్రభుత్వం వెంటనే ఆ కుట్ర యోచన విరమించాలని ఆయన డిమాండ్ చేశారు. దివ్యాంగులు ఆత్మగౌరవంతో బతికేలా చూస్తానని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ప్రభుత్వం నిర్వహిస్తున్న సదరం క్యాంపుల వద్ద కనీస వసతులు కల్పించకుండా వేధిస్తున్నా ఎందుకు నోరెత్తడం లేదని ప్రశ్నించారు. అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు తొలగిస్తే తమ పార్టీ చూస్తూ ఊర్కోదని, వారికి అండగా ఉంటుందని కిరణ్‌రాజ్ స్పష్టం చేశారు.