ఆస్ట్రేలియాకు చెందిన ఓ కోర్టు.. ఓ వ్యక్తి అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినట్లు రుజువు అయినప్పటికీ వదిలేసింది. అతడు నిర్దోషే అని ప్రకటించి బాధితురాలు సహా దేశ ప్రజలందరికీ షాక్ ఇచ్చింది. అసలు కోర్టు ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి, ఆ కథేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
2022వ సంవత్సరంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన 40 ఏళ్ల తిమోతి మాల్కం రోలాండ్.. ఒక అమ్మాయితో కలిసి స్థానికంగా ఉన్న డార్లింగ్ హార్ట్స్‌లోని కాక్టెయిల్ బార్‌కు వెళ్లాడు. అక్కేడ ఇద్దరూ ఫుల్లుగా మందుకొట్టారు. ఆపై అర్థరాత్రి 1 గంట ప్రాంతంలో తమ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. ఆపై ఇద్దరూ స్నానం చేసి ఒకే మంచంపై.. మద్యం మత్తులో హాయిగా పడుకున్నారు. కానీ ఉదయం 6 గంటలకు నిద్ర లేచిన మహిళ.. ఆమె ఒంటిపై బట్టలు లేకపోవడాన్ని గుర్తించింది.
ఈక్రమంలోనే ఏం జరిగిందో గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయగా.. రోలాండ్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలుసుకుంది. అదే విషయం అతడిని అడగ్గా.. లేదు నేను ఎలాంటి పాపమూ చేయలేదని చెప్పాడు. కానీ ఆమె మాత్రం వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈక్రమంలోనే రోలాండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆపై మహిళకు పలు పరీక్షలు నిర్వహించి.. ఆమెలో ఉన్న వీర్యం రోలాండ్ వీర్యంతో సరిపోయినట్లు గుర్తించారు. ఇలా ఆధారాలతో సహా అతడు నేరం చేసినట్లు బయట పెట్టారు.
ఈక్రమంలోనే ఈ కేసు కోర్టుకు వెళ్లగా.. ఆధారాలు అన్నీ పరిశీలించిన న్యాయస్థానం రోలాండ్‌ని దోషిగా తేల్చింది. అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడింది అతేడనని చెప్పింది. అయితే రోలాండ్ మాత్రం.. తాను అత్యాచారం చేసినట్లు తనకు ఏమాత్రం గుర్తు లేదని.. తాను చాలా కాలంగా సెక్సోమ్నియా వ్యాధితో బాధ పడుతున్నట్లు వివరించాడు. అతడి వాదనలు విన్న న్యాయస్థానం.. అతడు నిజంగానే ఆ వ్యాధితో బాధ పడుతున్నాడా లేదా అనేది గుర్తించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.
అనేక పరీక్షలు చేసిన వైద్యులు.. నిజంగానే రోలాండ్ సెక్సోమ్నియాతో బాధ పడుతున్నాడని చెప్పారు. అలాగే సెక్సోమ్నియా అంటే.. నిద్రలో తమకు తెలియకుండానే నడిచే అలవాటు ఉన్నవారి లాగానే ఈ బాధితులు తమ ప్రమేయం లేకుండానే పక్కవారిపై నిద్రలో అత్యాచారం చేస్తారని వివరించారు. ఇదంతా విన్న న్యాయస్థానం.. రోలాండ్ తన ప్రేమయం లేకుండానే చేసిన నేరానికి దోషిగా నిర్ధారించలేమంటూ అతడిని దోషిగా ప్రకటించింది.
దీనిపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే.. రోలాండ్ అత్యాచారానికి పాల్పడినప్పుడు నిద్రలో లేడని నిరూపించాల్సి ఉంటుందని.. అది నిరూపణ అయితే తాము కఠిన శిక్ష కూడా వేస్తామని కోర్టు స్పష్టం చేసింది. కానీ ఎవరూ ఇందుకు అభ్యంతరం చెప్పలేదు. ఎందుకంటే బాధిత మహిళ కూడా ఆ సమయంలో మద్యం మత్తులో ఉండడంతో.. రోలాండ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తేల్చలేకపోయింది. కాబట్టి ఈ కేసును కొట్టివేస్తున్నట్లు కోర్టు చెప్పగా.. దేశ వ్యాప్తంగా ఈ కేసు సంచలనం సృష్టించింది.