మలేషియా వేదికగా జరుగుతోన్న అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరుకోవడం గమనార్హం. శుక్రవారం (జనవరి 31)న జరిగిన సెమీస్‌లో భారత్ ఇంగ్లండ్‌ను చిత్తు చిత్తుగా ఓడించింది. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఆఖరి దశకు చేరుకుంది. శుక్రవారం (జనవరి 31) తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్ కు దూసుకెళ్లింది. కాగా ఆదివారం (ఫిబ్రవరి 02)న జరిగే టైటిల్ పోరులో భారత్-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. గతేడాది పురుషుల టీ20 ప్రపంచకప్ 2024 టోర్నమెంట్‌లో ఈ రెండు జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ఓటమి అంచుల దాకా వెళ్లిన టీమిండియా ఉత్కంఠ విజయం సాధించింది. జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్ ఇప్పటికీ క్రీడాభిమానుల మదిలో మెదులుతోంది. ఇప్పుడు క్రీడాభిమానులకు మరోసారి భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌ల పండగ కానుంది. ఫిబ్రవరి 2న టీమిండియా-దక్షిణాఫ్రికా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.