రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. వావి వరసలు లేకుండా పలువురు వివాహేతర సంబంధాలు నెరపుతూ.. అడ్డుగా వచ్చిన వారి కుటుంబ సభ్యులను అంతమొందిస్తున్నారు. అలాంటి ఘటనే జరిగింది తాజాగా. తల్లీకూతుళ్లు ఇద్దరూ కలిసి ఒకే వ్యక్తిపై మనసు పాడేసుకున్నారు. అతడు కూడా వీరిద్దరితో శారీరక సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే తల్లితో సంబంధం గురించి కూతురికి, కూతురు బంధం గురించి తల్లికి కూడా తెలుసు. అయినా ముగ్గురూ కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా ఈ విషయం ఇంటి పెద్దకు తెలియడంతో.. ముగ్గురూ కలిసి అతడిని దారుణంగా హత్య చేశారు. ఆపై ఇంట్లోనే అతడి మృతదేహాన్ని పాతి పెట్టారు. చివరకు ఈ విషయం వెలుగులోకి రావడంతో వీరంతా ఊచలు లెక్కబెడుతున్నారు.
బిహార్‌లోని భగల్పూర్కు చెందిన 35 ఏళ్ల కైలు దాస్‌కు చాలా ఏళ్ల క్రితమే సరితా దేవితో పెళ్లి అయింది. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గరు పిల్లలు కూడా పుట్టారు. వారిలో పెద్దవాడు దయానంద్ కాగా, రెండో కుమార్తె జాలీ, మూడో కుమారుడు దేవానందన్. పెద్ద కుమారుడు చాలా పెద్దవాడు కాగా.. బంకా జిల్లాలోని రాజౌన్లో నివాసం ఉంటూ క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అయితే జీవనోపాధి నిమిత్తం కైలుదాస్ గ్రామంలోనే చిన్నపాటి హోటల్, కిరాణా దుకాణం నడుపుతున్నాడు.
భార్యా పిల్లులు కూడా అప్పుడప్పుడూ అక్కడకు వెళ్తూ అతడికి సాయం చేస్తున్నారు. ఈక్రమంలోనే భార్య సరితా దేవికి, కుమార్తె జాలీకి పాల్వా గ్రామానికి చెందిన దినేష్ యాదవ్‌తో స్నేహహం ఏర్పడింది. ఈక్రమంలోనే అతడు అప్పుడప్పుడూ వారి ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. జాలీ, సరితా దేవి అతడు ఇంటికి వస్తున్నాని చెబితే.. ఇంట్లోనే ఉండేవాళ్లు. వీరిద్దరికి దినేష్ యాదవ్ అంటే ప్రేమ ఏర్పడింది. ఈక్రమంలోనే వీరు అతడితో శారీరక సంబంధం సాగించారు. కాసేపు తల్లి మరికాసేపు కూతురు అతడితో ఎంజాయ్ చేసేవారు.
అయితే నెల రోజుల క్రితం వీరి బంధాన్ని గుర్తించిన కైలుదాస్.. భార్య, కూతురును నిలదీశాడు. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే ప్రాణాలు తీస్తానంటూ హెచ్చరించాడు. అదే విషయాన్ని అమ్మా, కూతుళ్లు ఇద్దరూ ప్రియుడు దినేష్ యాదవ్‌కు చెప్పారు. ఎలాగైనా సరే భర్త అడ్డు తొలగించుకుంటే.. ముగ్గురం కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేయొచ్చని సరితా దేవి చెప్పగా.. జాలీ, దినేష్ యాదవ్‌లు సైతం అదే సరైన నిర్ణయం అని చెప్పారు. ఈక్రమంలోనే ముగ్గురూ కలిసి కైలుదాస్ హత్యకు అదిరిపోయే ప్లాన్ వేశారు.
చిన్న కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి.. జాలీ, సరితా దేవి, దినేష్ యాదవ్ ముగ్గురూ కలిసి కైలుదాస్ చంపేశారు. అపై అతడి మృతదేహాన్ని ఇంటి ఆవరణలోని పెరట్లో పాతిపెట్టారు. దినేష్ యాదవ్ అక్కడి నుంచి వెళ్లిపోగా.. తల్లీకూతుళ్లు ఇద్దరూ కైలుదాస్ కనిపించడం లేదంటూ నాటకం ఆడడం ప్రారంభించారు. అయితే తండ్రి అదృశ్యం వార్త తెలుసుకున్న పెద్ద కుమారుడు దయానంద్ వెంటనే ఇంటికి వచ్చాడు. ఎప్పటి నుంచి కనిపించడం లేదని.. ఏదైనా గొడవ జరిగిందా అంటూ కుటుంబ సభ్యులను అడిగాడు.
కానీ వాళ్లు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో.. గ్రామస్థులను అడిగాడు. వారు కూడా తమకు తెలియదనడంతో.. తల్లి, చెల్లిని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో వారి ఇంటి నుంచి దుర్వాసన రావడం గుర్తించారు స్థానికులు. ఇదే విషయాన్ని దయానంద్‌కు ఫోన్ చేసి చెప్పగా.. అతడు పోలీసులను తీసుకుని ఇంటికి చేరుకున్నాడు. వాసన వస్తున్న స్థలాన్ని తవ్వి చూడగా.. కైలుదాస్ మృతదేహం లభ్యం అయింది. అప్పటికే సరితా దేవి, జాలీలు తీవ్రంగా భయపడిపోతుండగా.. అందరికీ వారిద్దరిపైనే అనుమానం వచ్చింది.
దీంతో గ్రామస్థులంతా తల్లీకూతుళ్లు సరితా దేవి, జాలీయే ఈ హత్యకు పాల్పడి ఉంటారని వారిపై దాడి చేయడం ప్రారంభించారు. దయానంద్ సైతం వారిద్దరినీ కొట్టాడు. మీరేనా ఇదంతా చేసిందని నిలదీశాడు. అంతోలనే పోలీసులు వారిని అడ్డుకుని సరితా దేవి, జాలీలను అరెస్ట్ చేసి తమదైన స్టైల్లో విచారించారు. ఈక్రమంలోనే వారిద్దరూ కైలుదాస్ను చంపింది తామేనని చెప్పారు. ప్రియుడు దినేష్ యాదవ్ సాయంతోనే హత్య చేశామని.. అతడితో తామిద్దరికీ శారీరక సంబంధం ఉందని కూడా వెల్లడించారు. ఈ విషయాలు తీసుకున్న కైలుదాస్ కుమారులు, గ్రామస్థులు అంతా షాక్ అయ్యారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పోలీసులు దినేష్ యాదవ్‌ను పట్టుకునేందుకు పెద్ద ఎత్తున గాలిస్తున్నారు.