ఏపీలో దారుణ ఘటన వెలుగు చూసింది. రాజమండ్రిలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ అత్యాచారం చేశాడు. పెళ్లి చేసుకుంటా అని నమ్మించి విద్యార్థినిపై మూడు రోజులపాటు లైంగిక దాడి చేశాడు. కూతురు కనిపించకపోవడంతో కొవ్వూరు పోలీస్ స్టేషన్‌లో విద్యార్థిని తల్లి మిస్సింగ్ కేసు నమోదు చేసింది. విషయం తెలిసిన లెక్చరర్.. బాలికను భీమవరంలో వదిలి పారిపోయాడు. తన తల్లికి ఫోన్ చేసి బాలిక విషయం చెప్పడంతో పోలీసులు మిస్సింగ్ కేసును పోక్సో కేసుగా మార్చారు.