విద్యార్థుల ఫీజు బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని గిరిజన విద్యార్థి సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మల్లికార్జున నాయక్ డిమాండ్ చేశారు. 5న వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే ఫీజు పోరుకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజన విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 5వ తేదీన నిర్వహించ తలపెట్టిన ఫీజు పోరుకు పీఎస్యూ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షులు మంజుల నరేంద్ర తెలిపారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలన్నారు. వెంటనే ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.