సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచడానికి ఉద్యమిస్తామని మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక పింఛన్లు మాత్రమే అందిస్తున్నారని, అందులోనూ కోతలకు సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ఆర్థిక సమస్యలు అంటూ సూపర్ సిక్స్ హామీలను ఎగ్గొట్టడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు ఇచ్చినప్పుడే అప్పటి సీఎం జగన్ ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని తాను ఇస్తున్న పథకాల కంటే ఎక్కువగా చంద్రబాబు సంక్షేమ పథకాలను ఇవ్వలేరని చెప్పారని తెలిపారు. కానీ 14 ఏళ్లు సీఎంగా, ఎన్టీఆర్ క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా పని చేసిన చంద్రబాబుతో పాటు బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్‌లు ‘మేమున్నాం సూపర్ సిక్స్ అమలు చేస్తాం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారని తెలిపారు.
ఆనాడు వైయస్ జగన్ అప్పులు చేశారని చెబుతూనే సంపద సృష్టించి సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామంటూ చంద్రబాబు అన్నారన్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు.. తీరా ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు,స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు కరుమజ్జి సాయి, విజయనగరం జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా మేధావి వర్గం అధ్యక్షులు శ్రీనివాస కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు జై హింద్ కుమార్, జడ్పీటీసీ వర్రి నరసింహ మూర్తి,జడ్పీటీసీ కెళ్ళ శ్రీనివాసరావు,మాజీ డీసీఎంఎస్ చైర్మన్ రమణ రాజు, రాష్ట్ర కార్యదర్శి పులి రాజు, పతివాడ అప్పల నాయుడు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ ఆశపు వేణు, కార్పొరేటర్ రాజేశ్వర రావు, బంగారు నాయుడు, భాను మూర్తి తదితరులు పాల్గొన్నారు.