అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల లో రథసప్తమి పర్వదిన వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.ఈ మేరకు ఇవాళ ఉదయం సప్త వాహనాలపై శ్రీవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అయితే, వాహన సేవలను తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో టీటీడీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గ్యాలరీలలో వేచి వుండే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా తిరు వీధుల్లోని గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాహన సేవలను తిలకించేందుకు తిరుమాడ వీధులకు బయట అధికారులు భారీ ఎల్ఈడీ స్క్రీన్ల (ను ఫిక్స్ చేశారు. ఇటీవల తిరుపతి లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో పెట్టుకుని రథసప్తమి వేడుకల సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు దాదాపు 2 వేల మందితో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.
రథసప్తమి పర్వదినం సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడు సప్త వాహనాలపై భక్తులకు దర్శన భాగ్యం కల్పించనున్నాడు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనంపై, 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనంపై మాడ వీధుల్లో ఊరేగించనున్నారు. ఇక 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గరుడ వాహనంపై, మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనంపై ఊరేగనున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు శ్రీవారి వరాహ పుష్కరిణిలో చక్రస్నానం (Chakra , సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామిగా దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాలm (Sarvabhupala) వాహనంపై, రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ (Chandraprabha వాహనంపై ఊరేగింపుతో వాహన సేవలు పరిసమాప్తం కానున్నాయి.