ఎన్టీఆర్ జిల్లా, నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికలో ట్విస్ట్ నెలకొంది. ఎమ్మెల్యే, ఎంపీ వర్గాలు సూచించిన అభ్యర్థులు కాకుండా టీడీపీ అధిష్టానం మూడో పేరును పరిశీలనలోకి తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా మండవ కృష్ణకుమారికి బీఫారం పంపింది. దీంతో నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో మంత్రి నారాయణ మాట్లాడారు. అధిష్టానం సూచించిన పేరునే ప్రతిపాదిస్తానని ఎమ్మెల్యే సౌమ్య తెలిపారు. కాగా నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికపై సోమవారం నుంచి తెలుగుదేశంలో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న శాకమూరి స్వర్ణలతకు టీడీపీ హై కమాండ్ బీ ఫారం పంపించింది. అయితే ఆ పేరును తాము అంగీకరించబోమని ఎమ్మెల్యే సౌమ్య కౌన్సిలర్లను పక్కను పెట్టుకుని సమావేశానికి రాలేదు. దీంతో సమావేశం కోరం లేక వాయిది పడింది.