ప్రొద్దుటూరుకు చెందిన జె.రవిచంద్ర, బి.లక్ష్మిదేవిలు హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గానికి ఎంపిక కావడంపై క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరూ భార్యభర్తలు కాగా మొదటిసారి రాష్ట్ర కార్యవర్గం సభ్యులుగా ఎంపిక కావడంపై జిల్లా హాకీ అసోసియేషన్ నాయకులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. జె.రవింద్ర రాష్ట్ర హాకీ క్రీడాకారునిగా జాతీయస్థాయిలో ప్రతిభ కనపరిచారు. హాకీ అసోసియేషన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా, జిల్లా అధ్యక్షునిగా జిల్లాల్లో హాకీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఆయన ప్రతిభ ఆధారంగా పోలీసు కానిస్టేబుల్‌గా ఎంపికై స్పోర్ట్స్ కోటాలో హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో ఆర్‌ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తూనే హాకీ క్రీడాకారులను తీర్చిదిద్దుతున్నారు. బి.లక్ష్మిదేవి ఖోఖోలో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. ఆమె ప్రస్తుతం వైవీఎస్ మున్సిపల్ గర్ ్ల్స హైస్కూలులో ఫిజికల్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ హాకీ క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఫిజికల్ డైరెక్టర్‌గా అనేకమంది విద్యార్థులను క్రీడాకారులుగా తీర్చిదిద్దారు. హాకీ అసోసియేషన్ వారు చేసిన సేవలను గుర్తించి అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నుకున్నారు. రాష్ట్ర కార్యవర్గానికి వారు ఎన్నిక కావడానికి కృషి చేసిన అసోసియేషన్ రాష్ట్ర డైరెక్టర్ ఎన్.నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు చాణిక్యరాజు, రాష్ట్ర కార్యదర్శి హర్ష, ఇతర కార్యవర్గ సభ్యులకు హాకీ అసోసియేషన్ మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి శేఖర్‌లు కృతజ్ఞతలు తెలిపారు.