ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేశకుమార్ సూచిం చారు. సోమవారం కడప ఏఆర్ పోలీసు పరేడ్ మైదానంలో తనిఖీ అనంతరం దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజలకు మెరుగైన సేవలు అం దిస్తూ మంచి పేరు తీసుకురావాలన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామన్నారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని కోరారు. హోంగార్డులు దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవన్నారు. ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యంగా ఉన్నప్పుడే సమర్ధవంతంగా విధులు నిర్వర్తించడానికి వీలవుతుందన్నారు. హోంగార్డుల సంక్షేమంలో భాగంగా పలు చర్యలు తీసుకుంటున్నామని కమాండెంట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐ శ్రీశైలంరెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.