ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టుల వేట కొనసాగుతోంది. కాంకేర్, నారాయణపూర్ జిల్లాల సరిహద్దులో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. రెండు జిల్లాల సరిహద్దులో నార్త్ బస్తర్ మాడ్ డివిజన్ మావోయిస్టు కమిటీ సంచరిస్తోందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ రిజర్వ్ గార్డ్స్, బీఎ్‌సఎఫ్ జవాన్లు సంయుక్తంగా ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు పక్షాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనా స్థలంలో ఒక మావోయిస్టు మృతదేహాన్ని బలగాలు కనుగొన్నాయి. మృతదేహానికి సమీపంలో ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, సోలార్ ప్లేట్, ఇతర పేలుడు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. మరికొందరు మావోయిస్టులు మృతి చెంది ఉండవచ్చని, లేదా తీవ్రంగా గాయపడి ఉంటారని పోలీసులు చెప్తున్నారు. మృతి చెందిన మావోయిస్టును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాగా మాడ్ ప్రదేశంలో గాలింపు కొనసాగుతోంది.