నూజివీడు మున్సిపల్ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టారు. సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్ నాగరాజు సోమవారం నూజివీడు ప్రధాన డ్రెయిన్లలో పూడికతీత కార్యక్రమాన్ని చేపట్టారు. డ్రెయిన్లలో ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. మురుగు కాలువల్లో ఎవరైనా వ్యర్థాలు వేస్తే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేశారు. కుక్కలు, కోతుల దాడుల వల్ల ప్రజలు గాయాల పాలవుతున్న విషయాన్ని స్థానికులు ప్రస్తావించిన నేపథ్యంలో.. ఈ సమస్య పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు. కుక్కల సంతతి నివారణకు ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు వాటిని పట్టి తరలించారు.