బాపట్ల పట్టణంలో పాత బస్టాండ్ వద్ద శనివారం పట్టణ సిఐ రాంబాబు వాహన తనిఖీ నిర్వహించారు. బాపట్ల జిల్లా అధికారుల ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో ఎవరు గాయపడకూడదని సంకల్పంతో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పట్టణ సీఐ రాంబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.