ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో కల్లుగీత కార్మికులకు కేటాయించిన 10 మద్యం దుకాణాలను సోమవారం కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆధ్వర్యంలో లాటరీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు కలెక్టరేట్‌లోని డీఆర్‌డీఏ మీటింగ్ హాల్‌లో కలెక్టర్ సమక్షంలో ఎక్సైజ్ అధికారులు లాటరీ ద్వారా పారదర్శకంగా దుకాణాల కేటాయిస్తారు. ఓ వ్యక్తికి ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తారు. 10 మద్యం దుకాణాలకు 79 దరఖాస్తులు వచ్చాయి. వీటిల్లో.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు 13, చిత్తూరు రూరల్ మండలానికి 14, నగరి మున్సిపాలిటీకి 11, పలమనేరుకు 5, పుంగనూరుకు 8, గుడిపల్లెకి 16, పాలసముద్రానికి 6, వి.కోటకు 2, పెద్దపంజాణికి 1, వెదురుకుప్పానికి 3 ఉన్నాయి.
![]() |
![]() |