కుంభమేళా లో భక్తుల తాకిడి కొనసాగుతోంది. కోట్లమంది భక్తులు ప్రయాగ్‌రాజ్ (Prayagraj)కు పోటెత్తుతుండడంతో వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.దీంతో విపరీతమైన ట్రాఫిక్ వల్ల స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధిక రద్దీ కారణంగా ప్రయాగ్‌రాజ్ సంగం రైల్వేస్టేషన్‌ను శుక్రవారం వరకు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈవిషయంపై ఇప్పటికే ప్రతిపక్షాలు అధికార ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ యోగి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.కుంభమేళా నిర్వహణలో యోగి ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రయాగ్‌రాజ్ ప్రజలు ట్రాఫిక్ కష్టాలు ఎదుర్కొంటున్నారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. ప్రతిచోట వాహనాల రద్దీ నెలకొనడంతో భక్తులకు ఆహార ధాన్యాలు, కూరగాయలు, ఔషధాలు, పెట్రోల్, డీజిల్ వంటివి అందటం లేదన్నారు. దీంతో కోట్లాది మంది ప్రజలకు ఆకలిదప్పులు తప్పట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గంటగంటకు ట్రాఫిక్ రద్దీ పెరగుతుండడంతో భక్తులు ఆహారం, విశ్రాంతి లేక నీరసించిపోతున్నారని పేర్కొన్నారు.విద్యార్థులతో పరీక్షాపే చర్చ.. వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
ఆదివారం ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు పెద్దఎత్తున పోటెత్తడంతో వందల కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయిన దృశ్యాలను అఖిలేశ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ విఫలమయినప్పుడు ప్రభుత్వాన్ని అధికారం నుంచి తప్పిస్తారు. అదేవిధంగా అసమర్థులు చేసే అసత్య ప్రచారాలను నమ్మకుండా కుంభమేళా వైఫల్యాన్ని విశ్లేషించి.. ప్రజలు సమర్థుడైన వ్యక్తికి పరిపాలనా బాధ్యతలు అప్పచెప్పాలి'' అని పేర్కొన్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాకుంభం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 44 కోట్ల మంది పుణ్య స్నానాలు ఆచరించారు.
![]() |
![]() |