తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లెలో కొలువైన ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్స వాలల్లో భాగంగా ఆదివారం శ్రీనివాసుడి కల్యా ణం కమనీయంగా జరిగింది. గత ఐదు రోజులు గా టీటీడీ ఆధ్వర్యంలో వెంకన్న వార్షిక బ్రహ్మో త్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం నిత్య కైంకర్యాలు పూర్తి చేసుకున్న అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటరమణ స్వామి వారు సర్వభూ పాల వాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహ రిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం టీటీడీ వేదపండితులు వేదమంత్రోచ్ఛారణలు మంగళవాయిద్యాలు, అన్నమయ్య సంకీర్తనల నడుమ తిరుమలేశుడి పరిణయం నయన మనో హరంగా జరిపించారు.
అశేష సంఖ్యలో తరలివ చ్చిన భక్తులు శ్రీనివాసుడి కల్యాణాన్ని తిలకించి తరించారు. భక్తజనం చేసిన గోవింద నామస్మర ణలతో వేదిక ఆవరణం మార్మోగింది. స్వామి వారి కళ్యాణోత్సవంలో టీడీపీ ఇనచార్జి దాసరి పల్లె జయచంద్రారెడ్డి, కల్పనారెడ్డి దంపతులు, ప్రచార సమన్వయకర్త సీడ్ మల్లికార్జుననా యుడు, అరుణ దంపతులు, మండలాధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి,సిద్దమ్మ, క్లస్టర్ ఇంచార్జి బేరి శ్రీనివా సులు, సోముశేఖర్, ఆదిరెడ్డి, ఆనందనాయుడు, శివరాం, జయరాంరెడ్డి, రవిచంద్ర, కేశవరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
![]() |
![]() |