మహాశివరాత్రి ఏర్పాట్లు పరిశీలించేందుకు సోమవారం రాష్ట్ర మంత్రుల బృందం ఆరుగురు మంత్రులు శ్రీశైలం వెళుతున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, ఆనం రామనారాయణ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, అనిత, ఎన్ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి తదితరులు రానున్నారు. కాగా శ్రీశైల మహాక్షేత్రం ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. దేశ, విదేశీ యాత్రికులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. ఇటీవల కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి విద్యావతి ఆధ్వర్యంలో శ్రీశైలంలో అంతర్జాతీయ స్థాయిలో సదుపాయాలు కల్పించే విషయమై ప్రాథమిక సమీక్ష జరిపారు. విడతల వారీగా ఆధునిక వసతులు కల్పించేందుకు కన్సల్టెన్సీల ద్వారా ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు.
![]() |
![]() |