రణస్థలం పరిధిలోని కమ్మసిగడాం మహాలక్ష్మి తల్లి జాతర చివరి రోజు ఆదివారం అంబరాన్ని తాకింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహాలక్ష్మి తల్లిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు దర్శించుకున్నారు. పురందేశ్వరికి ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, ఆలయ కమిటీ అధ్యక్షుడు వీవీ ఎస్‌వీ ప్రసాద్, బంటుపల్లి సర్పంచ్ నడుకుదిటి రజిని ఘన స్వాగతం పలికారు. ఆమెకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపికను అందజేశారు. కూటమి ప్రభుత్వానికి అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయని, మహాలక్ష్మిని దర్శించుకోవడం ఎంతో ఆనందగా ఉందని పురందేశ్వరి అన్నారు.
![]() |
![]() |