గోవిందుని నామాలతో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం మార్మో గింది. ఆదివారం సెలవుదినం కావడం తో అధిక సంఖ్యలో భక్తులు చిన వెంకన్న దర్శనార్ధం తరలివచ్చారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తుల రద్దీ ప్రారంభమైంది. క్యూలైన్లు, ప్రసా దాల కౌంటర్లు, క్యూకాంప్లెక్స్‌లు, అన్న దానం వద్ద భక్తుల సందడి నెలకొంది. దాదాపు 12వేల మంది స్వామి, అమ్మ వార్లను దర్శించినట్లు ఆలయ అధికా రుల అంచనా. దర్శనానంతరం వారం తా వకుళమాత అన్న ప్రసాద భవనానికి చేరుకుని ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు.
![]() |
![]() |