గుజరాత్ ఖేడా జిల్లా నదియాద్ నగరంలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా మరణించారు. ప్రాథమికంగా మద్యం సేవించడంతోనే ఈ మరణాలు సంభవించాయని చెబుతున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరణించిన వారిలో యోగేష్ కుష్వాహా (40), రవీంద్ర రాథోడ్ (50), కనుభాయ్ చౌహాన్ (59) ఉన్నారు. పోలీసుల ప్రకారం ఈ ముగ్గురు వ్యక్తులు జీలకర్ర సోడాతో సహా మద్యం సేవించారని అంటున్నారు. ఆ తర్వాత వారి ఆరోగ్యం క్షీణించి ఒక్కొక్కరు స్పృహ కోల్పోయారు.ఈ ముగ్గురు వ్యక్తుల ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని నాడియాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆసుపత్రికి చేరుకునేలోపు వారు మృతి చెందారు. ప్రారంభ విచారణలో మృతుల్లో ఇద్దరి రక్తంలో 0.1 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు, మరొకరిలో 0.2 ఇథనాల్ ఆల్కహాల్ ఉన్నట్లు రక్త నమూనా పరీక్షలు తేల్చాయి. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు, FSL (ఫారెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ) బృందం, జిల్లా ఎల్సీబీ, ఎస్‌ఓజీ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, స్థానిక పోలీసు బృందాలు దర్యాప్తు చేస్తున్నాయి.
![]() |
![]() |