ఉద్యోగులకు ఇచ్చిన హామీలను కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, ఒక్క నెల తప్ప, మిగిలిన ఏ నెలలో అయినా మొదటి రోజు జీతాలు చెల్లించారా అని జగన్ అడిగారు. ఇది ఆశ్చర్యకరమే. అటు స్కీములలో ఒక్కటీ అమలు చేయక, ఇటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు తీర్చకుండా, జీతాలు సకాలంలో ఇవ్వలేని పరిస్థితి ఎందుకు తయారైందో అర్థం కాదు. జనం సంగతి పక్కనపెట్టి, టీడీపీ కార్యకర్తలకు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వడంలో మాత్రం శ్రద్ద వహిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. కొత్త ఉద్యోగం ఒక్కటి ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాలు 2.5 లక్షల లక్షల ఉద్యోగాలు తొలగించారని జగన్ వ్యాఖ్యానించారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ మద్యం షాపులలో సుమారు 18వేల మంది ఉద్యోగులు ఉండేవారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటన్నిటినీ ప్రైవేటు పరం చేసి కొత్త షాపులు ఇవ్వడంతో వీరికి ఉద్యోగాలు పోయాయి.రెండున్నర లక్షల మంది వలంటీర్లకు పది వేల చొప్పున జీతాలు ఇస్తామని ఉగాది నాడు దేవుడి సాక్షిగా చెప్పిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఆ తర్వాత వారి ఉద్యోగాలకే ఎసరు పెట్టారు. అందుకే చంద్రబాబు చీటింగ్‌లో పీహెచ్‌డీ చేశారని జగన్ ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఉప ఎన్నికలలో టీడీపీ చేసిన అరాచకాలపై కూడా వైఎస్ జగన్ నిలదీశారు. మొత్తం మీద చంద్రబాబు ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం, ప్రజాస్వామ్య విధ్వంసం, పారిశ్రామిక విధ్వంసం, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులు, హింసతో కూడిన విధ్వంసం మొదలైనవి చేస్తూ ప్రజలను మోసం చేసే ప్రక్రియలో ఉందని వైఎస్ జగన్ స్పష్టంగా వివరించారు.
![]() |
![]() |