పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని ఎన్నికల సమయంలో కూటమి హామీ ఇచ్చిందని, వెంటనే ఆ హామీని అమలు చేయాలని, ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు ఇవ్వాలని సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకా్షబాబు డిమాండ్ చేశారు. గుడివాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఐ నాయకులు ఆందోళన నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇళ్లస్థలాలను ఊరి బయట, నివాసయోగ్యం కాని ప్రాంతాల్లో కేటాయించారని ప్రకా్షబాబు అన్నారు. సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు సెంటు, సెంటున్నర స్థలాలు సరిపోవని అప్పట్లో ఆందోళన కార్యక్రమాలు చేశాయని ఆయన తెలిపారు. ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ వాసిరెడ్డి రామకోటేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు. నాయకులు చింతలూరి సత్యనారాయణ, జి.నాగశేషు, పి.రంగారావు, కె.వెంకన్న, జ్యోతి, మల్లీశ్వరీ, సరస్వతి పాల్గొన్నారు.
![]() |
![]() |