తూర్పు గోదావరి జిల్లా, ఆలమూరు పరిధిలోని చింతలూరులోనున్న శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 22 వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. సోమవారం బ్రహ్మోత్సవ నిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను విలేకరుల సమావేశంలో వారు తెలిపారు. ఈనెల 17న ఉదయం 5 గంటలలకు స్వామి వారి సుప్రభాతం, తోమాలసేవ, కొలువు 8గంటలకు పవిత్రోత్సవం సాయంత్రం 4 గంటల నుంచి శేషవాహనంపై ఊరేగింపు జరుగుతాయని వారు తెలిపారు. 18న గరుడ వాహనం, 19న గజవాహనం, 20న హనుమద్ వాహనం, 21న కల్పవృక్ష ముత్యాల పందిరి వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపులు జరుగుతాయన్నారు. ఆరు రోజులపాటు ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సుప్రభాతసేవ, తోమాల సేవ, లఘు అర్చన, బ్రహ్మోత్సవ సంకల్పం, స్వస్తి వాచకం తదితర సేవలు వాడపల్లి గోపాలాచార్యులు పర్యవేక్షణలో బ్రహ్మోత్సవాలు జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
![]() |
![]() |