దివ్యాంగులకు గుర్తించి వారికి సకలాంగులు తరహాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని శ్రీకాకుళం జిల్లా అదనపు న్యాయాధికారి పి.భాస్కరరావు కోరారు. సోమవారం శ్రీకాకుళంలోని కోర్టు ప్రాంగ ణంలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో డోర్ టు డోర్ దివ్యాంగుల గుర్తించే కార్య క్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతులు గుర్తిస్తామన్నారు. పలు శాఖల జిల్లా అధికారులు, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం, పానెల్ లాయర్లు, పారా లీగల్ వలంటీర్లు, అంగన్వాడీలు, ఎఎన్ఎంలు, ఇతర సిబ్బంది సమక్షంలో సర్వేను నిర్వహిస్తామని తెలిపారు. సీనియర్ సివిల్ న్యాయాఽధికారి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రంలో న్యాయాధికారులు సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్, ఎం.ఫణికుమార్, సీహెచ్ యుగంధర్ పాల్గొన్నారు.
![]() |
![]() |