నగిరి మండలంలోని తెరణి గ్రామం కుశస్థలి నదిలో అక్రమార్కులు యదేచ్చగా ఇసుకను తవ్వుతూ తమిళనాడుకు తరలిస్తున్నారని స్థానికులు మంగళవారం వాపోయారు. ఇదే విధంగా జరిగితే రాబోవు రోజులలో నదిలో ఇసుక శాతం తగ్గిపోయి భూగర్భ జలాలు అడుగట్టు పోయే ప్రమాదం ఉందని ప్రజలు తెలియజేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
![]() |
![]() |