అనంతపురం నగరంలోని మరువవంకకు కలిసే అశోక్‌నగర్‌లోని అమ్మవారి వంకపై ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ తెలుగు యువత అధికార ప్రతినిధి వెంకటరామయ్య ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ని కోరారు. గత ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా అశోక్‌నగర్ ప్రధాన రహదారిలో వంకపై బ్రిడ్జి నిర్మించారని, దీంతో జీరో క్రాస్ రోడ్డు పూర్తిగా కనుమరుగై రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోందన్నారు.వంక చుట్టూ కట్టిన అక్రమ కట్టడాలపై చర్యలు తీసుకోవాలని కోరారు.నగరపాలిక పరిధిలో కార్పొరేషన స్థలాలను కబ్జా చేసే ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. స్థానిక సమస్యలపై పలురు వినతి పత్రాలు అందజేశాన్నారు. సెంట్రల్ పార్క్‌లో సర్వే చేపట్టి, ఆక్రమించిన స్థలాలను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. ప్రసన్నాయపల్లి వద్ద 20 ఎకరాల స్థలం కబ్జాకు గురైందని, తిరిగి స్వాధీనం చేసుకుంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
![]() |
![]() |