రేపల్లె కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో గుండెపోటుకు చికిత్స అందుబాటులో ఉందని వైద్యశాల సూపరింటెండెంట్ సుధాకరం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఛాతి నొప్పి వచ్చినప్పుడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈసీజీ తీసి అవసరం.
అయిన వారికి రక్తనాళంలో గడ్డకట్టిన రక్తమును కరిగించేందుకు మొదటి గంటలోనే రూ. 40 వేలు విలువగల టెనెక్టెప్లేస్ ఇంజక్షన్ ఉచితంగా అందిస్తామన్నారు. ఈ సదుపాయాన్ని రేపల్లె ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
![]() |
![]() |