బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయంలో "మీ కోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక" కార్యక్రమంలో బండారు శ్రావణి శ్రీ, ఆర్డీఓ కేశవ నాయుడు గారితో పాటు తదితర అధికారులతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా దాదాపు 430 అర్జీలు స్వీకరించాము. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించాను.ఈ కార్యక్రమంలో ప్రధానంగా భూ సమస్యల అర్జిలే ఎక్కువగా వచ్చాయి. గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన తప్పిదాల వల్లే భూ సమస్యలు పేరుకుపోయాయి. ముఖ్యంగా దళిత భూములు ఆక్రమించుకోవడం, స్మశాన వాటికల స్థలాలు, వంకలు, రహదారులు కబ్జాలు చేశారు. పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పనిచేస్తాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల మద్యలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకే నేరుగా మండల స్థాయి అధికారులతో పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించాము. గ్రామాలలో సిసి రోడ్లు ,భూముల సమస్యలు రహదారి సమస్యలను వెంటనే పరిష్కారం చూపేందుకు, నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులతో ప్రణాళికలు వేసుకోవాలని కోరడం జరిగింది. ఇచ్చిన హామీ ప్రకారం అంబేద్కర్ భవనం నిర్మించి తీరుతాము. గత ప్రభుత్వంలో ప్రజలు ఎమ్మెల్యే ను నేరుగా కలవలేకపోయమని, కూటమి ప్రభుత్వ పాలనలో ఎమ్మెల్యేతో నేరుగా సమస్యలు చెప్పుకునే వీలుకల్గినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |