ఒంగోలులోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులు జూలై చివరినాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. మంగళవారం అగ్రహారం వెళ్ళే మార్గంలోని బ్రిడ్జి పనులను దామచర్ల, రైల్వే అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ దశాబ్దాల కాలం నాటి నుంచి ఎదురు చూస్తున్న రైల్వే అండర్ పా స్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలి పారు. అలాగే బ్రిడ్జి నిర్మాణం కారణంగా 5 నివా సాలు కోల్పోతున్నవారికి వేరే ప్రాంతంలో 2 సెం ట్లు చొప్పున స్థలాలు చూపి వారికి అండగా ఉంటామని ఆయన చెప్పారు. ప్రజల సౌకర్యార్ధం చేపడుతున్న పనులు త్వరితగతిన పూర్తి చేయాల ని సంబంధిత కాంట్రాక్టర్‌లకు, రైల్వే అధికారులకు సూచించారు. ఇక్కడి ప్రజలు గత కొన్నేళ్ళుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 2016 లో అన్నవరప్పాడు, సూరారెడ్డిపాలెం, కరవది వంటి ప్రాంతాల్లో రైల్వే అండర్ పాస్ వేయాలని ఎస్టిమేషన్‌లు వేయింనట్లు తెలిపారు. అప్పట్లో రైల్వే అధికారులు కూడా తగిన విధంగా చర్యలు చేపట్టినా, ప్రభుత్వం మారడంతో పనుల్లో జాప్యం జరిగిందని చెప్పారు. అయితే తిరిగి కూటమి ప్ర భుత్వం అధికారంలోకి రావడంతో అన్నవరప్పాడు వద్ద పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఆ ది శగా రైల్వే ఇంజనీర్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపా రు. కార్యక్రమంలో నగర కమిషనర్ వెంకటేశ్వ రరావు, కార్పొరేటర్లు చింతపల్లి గోపి, నాగభూష ణం తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |