పౌల్ర్టీ పరిశ్రమలో నెలకొన్న బర్డ్‌ఫ్లూ కారణంగా వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దని పశ్చిమ గోదావరి కలెక్టర్ నాగరాణి ప్రజలను కోరారు. పౌల్ర్టీ పారాల్లో చనిపోయిన కోళ్లను శాస్ర్తీయ పద్ధతిలోనే ఖననం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పర్యవేక్షణకు 20 రాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు తక్షణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ విషయమై ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని చెప్పారు. జిల్లాలోని చెరువులు, కొల్లేరు పరివాహక ప్రాంతాలో వలస పక్షులు వచ్చే ప్రాంతాల్లో ఈ వ్యాధి ప్రబలకుండా అప్రమత్తం చేశామన్నారు. ఎలర్ట్ జోన్‌లోని ప్రాంతాలలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు ఉడకబెట్టిన గుడ్లు, మాంసాన్ని నిరభ్యంతరంగా వినియోగించవచ్చని కలెక్టర్ నాగరాణి తెలిపారు. అన్ని జాగత్రలతో పిబ్రవరి 13 నాటికి వ్యాది సోకిన కోళ్లను తొలగించి ఖననం చేయడం జరుగుతుందని చెప్పారు. బర్డ్‌ఫ్లూ ప్రభావిత ప్రాంతాల్లో కోళ్ల ఫారాలు, కోడి మాంసం, కోడిగుడ్లు అమ్మకాలు, వినియోగంపై మూడు నెలలపాటు నిషేధం విధించినట్లు తాడేపల్లిగూడెం ఆర్డీవో ఖతిబ్ కౌసర్ భానో ఆరుగొలనులో జరిగిన సమావేశంలో వెల్లడించారు.
![]() |
![]() |