తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో 70,343 మంది పట్టభద్రుల ఓటర్లు ఉండగా, 98 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికోసం ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో రెండు బ్యాలెట్ పెట్టెలు కేటాయిస్తున్నారు. ఈనెల 14వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వ హిస్తున్నారు. డీఆర్వో వెంకట్రావు పర్యవేక్షణలో శిక్షణా కార్యక్రమం జరగనుంది. పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ కేంద్రం సమర్థంగా నిర్వహించే విధానాలను వివరిస్తారు. ఓటు ఎలా వేస్తే చెల్లుబాటు అవుతుందో తెలియజేస్తారు. గతంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమ యంలో అనుసరించిన విధానాలపై చర్చి స్తారు. ఈ పర్యాయం ఉపాధ్యాయుల పోలిం గ్ విధులకు దూరంగా ఉంటున్నారు. ఇంట ర్మీడియట్, 10వ తరగతి పరీక్షలు జరుగు తున్న నేపథ్యంలో ఎన్నికల విధుల నుంచి వార్ని దూరంగా పెట్టారు. కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా పోలింగ్ ప్రక్రి యను వీక్షిస్తారు. తూర్పు-పశ్చిమగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం పరిధిలో ఆరు జిల్లాలు ఉండగా కాకినాడ జిల్లాలోనే అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. జిల్లాలో మొత్తం పట్టభద్రుల ఓటర్లు 70,540 మంది కాగా, దీనిలో 42,463 మంది పురు షులు, 28072 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు అయిదుగురు ఉన్నారు. జిల్లాలో 625 మంది సిబ్బందిని నియమించగా దీనిలో పివోలు 125, ఏపీవోలు 125, ఓపీవోలు 250, సూక్ష్మ పరిశీలకులు 125 మంది ఉన్నారు.
![]() |
![]() |