పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ఎప్పుడో అధికారులు నిర్ణయించారు. విశాఖపట్టణంలో మార్చి 17 నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా ఇన్‌ఛార్జి రెవెన్యూ అధికారి సీతారామారావు ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయం వహించి పరీక్షలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని రకాల సాంకేతిక ప్రక్రియలను సకాలంలో పూర్తి చేసి పరీక్షల నిర్వహణకు అందరూ సన్నద్ధంగా ఉండాలని చెప్పారు. మార్చి 17వ తేదీ నుంచి జరగనున్న పదో తరగతి పబ్లిక్, ప్రయివేటు, ఓపెన్ ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఇతర ఏర్పాట్లపై డీఈవోతో కలిసి మంగళవారం ఉదయం కలెక్టరేట్ వీసీ హాలులో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయా విభాగాలు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు.
![]() |
![]() |