కుంభమేళాకు చెందిన వీడియో ఇంటర్నెట్‌లో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఇందులో ఒక వ్యక్తి కుంభమేళాలో ఫోన్లు ఛార్జ్ చేయడం ద్వారా గంటకు రూ. 1,000 సంపాదిస్తున్నట్లు చూపించారు. పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే ఈ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వీడియో తీస్తున్న వ్యక్తి వారి చూపిస్తూ, 'ఈ అబ్బాయి మహా కుంభ్‌లో గంటకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అదీ ఎటువంటి ఖర్చు లేకుండా. అతడు ఇక్కడ గంటకు 20 ఫోన్‌లను ఒకేసారి ఛార్జ్ చేసి వారి నుంచి రూ.50 రూపాయలు వసూలు చేస్తాడు. విద్యుత్ ఖర్చుకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే గంటకు కనీసం రూ.1000 రూపాయలు సంపాదిస్తున్నాడు.' అని చెప్తాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. "మహాకుంభమేళాలో ప్రతి 100 మీటర్ల దూరానికి ఉచిత ఛార్జింగ్ ఉంటుంది." "ఇదంతా అబద్ధం", "అంతా ఉచితం. మోసపోకండి" అంటూ రకరకాలుగా విమర్శిస్తున్నారు.
![]() |
![]() |