కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయపు పన్ను బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు.. పన్ను నిబంధనలను క్రమబద్దీకరిస్తోంది. అలాగే అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక విధానాలకు అనుగుణంగా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టవచ్చు. పన్నుల వ్యవస్థను ఆధునీకరించడంతోపాటు సరళీకృతం చేయడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో భాగంగా ఈ బిల్లును తీసుకువచ్చింది.ఇక ఈ కొత్త ఆదాయపు పన్ను బిల్లు ఆరు దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం1961 స్థానంలో తీసుకు వస్తున్నారు. ఈ ఆదాయపు పన్ను బిల్లు 2025లో 536 సెక్షన్లు ఉంటాయి. ప్రస్తుత ఆదాయపు పన్ను చట్టం -1961లోని 298 సెక్షన్ల కంటే ఇవి అధికం. అయితే ప్రస్తుత చట్టంలో 14 షెడ్యూల్స్‌ను కలిగి ఉంది. ఇవి కొత్త బిల్లులో 16కి పెరగనుంది. అలాగే ప్రతిపాదిత చట్టంలో మునుపటి సంవత్సరం పదాన్ని పన్ను సంవత్సరంగా పరిగణిస్తారు. అలాగే అసెస్మెంట్ ఇయర్ అనే భావన కూడా తొలగించబడింది.2024 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఆదాయపు పన్ను చట్టం మారుస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో 1961 నాటి ఆదాయపు పన్ను చట్టాన్ని సమీక్షాస్తామని చెప్పారు. అయితే జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనాయి. అవి ఫిబ్రవరి 13వ తేదీతో ముగిశాయి. అంటే నేటితో తొలి విడత బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఇక రెండో విడత బడ్జెట సమావేశాలు..మార్చి 10న ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.
![]() |
![]() |