తెలంగాణ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ దామోదరన రాజనర్సింహ శుభవార్త చెప్పారు. మరో 15-20 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం (SC Classification Act) రాబోతుందని.. చట్టం రాగానే 25 వేల పోస్టులతో వివిధ పోస్టుల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల కాబోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు, రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని మంత్రి అన్నారు. సోమవారం హైదరాబాద్ టూరిజం కన్వెన్షన్ హాల్‌లో ఎస్సీ వర్గీకరణపై మాదిగ నేతలతో మంత్రి దామోదర సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు వచ్చాక ఆరు నెలల్లోనే 90 శాతం వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. వర్గీకరణ చేసే వరకు నోటీఫికేషన్లు ఇవ్వమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదని గుర్తు చేశారు. వర్గీకరణపై కొంత మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అందరి అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత తమదేనని మంత్రి దీమా వ్యక్తం చేశారు.
![]() |
![]() |