ఇరవై ఏళ్ల కిందట ప్రపోజ్ చేసిన అమ్మాయి మళ్లీ ప్రత్యక్షమైతే..! మళ్లీ అదే లవ్ ప్రపోజల్‌తో ఎదురైతే..? ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..? టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కు ఇప్పుడు అలాంటి అనుభూతే ఎదురైంది. 20 ఏళ్ల కిందట మైదానంలో తనకు లవ్ ప్రపోజ్ చేసిన అమ్మాయి మళ్లీ ఎదురై సర్‌ప్రైజ్ ఇచ్చింది. 2005లో భారత్ - పాకిస్థాన్ మధ్య టెస్టు సిరీస్ జరిగింది. బెంగళూరు వేదికగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఒక మహిళా అభిమాని అందరి దృష్టిని ఆకర్షించింది. స్టాండ్స్‌లో ఉన్న ఆ లేడి ఫ్యాన్.. ‘జహీర్ ఐ లవ్ యూ’ అని రాసి ఉన్న ప్లకార్డును చూపిస్తూ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న జహీర్ ఖాన్‌కు ప్రపోజ్ చేసింది. కెమెరామ్యాన్ అటు వైపు తిప్పడంతో మైదానంలో అరుపులే అరుపులు.
జహీర్ ఖాన్ పక్కనే ఉన్న యువరాజ్ సింగ్ అతడిని ఆటపట్టించాడు. అమ్మాయికి బదులివ్వమని ప్రోత్సహించాడు. దీంతో జహీర్ ఆమెకు సైగల ద్వారా హాయ్ చెప్పాడు. అప్పుడామె తెగ సిగ్గు పడుతూ ఫ్లయ్యింగ్ కిస్ ఇచ్చింది. క్రీజులో బ్యాటింగ్ చేస్తున్న వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదంతా చూసి కాసేపు నవ్వుకున్నాడు. ఈ సన్నివేశం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచంది. అప్పట్లో ఈ సీన్‌కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అయ్యింది.
తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా జట్టుతో కలిసేందుకు వచ్చిన జహీర్‌కు 20 ఏళ్ల కిందట తనను ప్రపోజ్ చేసిన అభిమానితో స్వాగతం పలికించింది. మరోసారి ఆమె ‘జహీర్ ఐలవ్ యూ’ అనే ప్లకార్డును ప్రదర్శించింది. లక్నో సూపర్ జెయింట్స్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. 20 ఏళ్లు అయినా జహీర్‌పై ఆమె ప్రేమ చెక్కుచెదరలేదని ఫ్యాన్స్ పేర్కొంటున్నారు.
టీమిండియాకు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన జహీర్ ఖాన్.. సాగరికా ఘట్గే అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. 2017లో వీరి వివాహం జరిగింది. ఇక దేశంలో ఐపీఎల్ 2025 ఫీవర్ మొదలైంది. వేసవిలో వినోదం పంచేందుకు మెగా టోర్నీ సిద్ధమైంది. ఈసారి ఆయా జట్లలోని ఆటగాళ్లు కూడా మారడంతో తెగ చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఫ్రాంఛైజీలు కూడా అభిమానుల్లో జోష్ పెంచేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నాయి. అభిమానుల్లో ఆసక్తిని పెంచుతూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నాయి. లీగ్ ప్రారంభానికి మరో వారం రోజులు మాత్రమే ఉండటంతో.. ఆటగాళ్లంతా జట్టుతో చేరిపోతున్నారు. శిబిరంలోకి చేరుకున్న ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఫ్రాంఛైజీలు షేర్ చేస్తున్నాయి.
![]() |
![]() |