టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు తీసుకుంటున్న విషయం తెలిసిందే. వీరి విడాకుల పిటిషన్‌పై రేపటిలోగా తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టును బాంబే హైకోర్టు ఆదేశించింది. కూలింగ్ ఆఫ్ వ్యవధిని మినహాయించాలన్న పిటిషన్‌ను ఫ్యామిలీ కోర్టు తిరస్కరించగా, ఆ నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. చాహల్ ఐపీఎల్‌లో పాల్గొనాల్సి ఉన్నందున రేపటిలోగా తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా, ఈ దంపతులకు 2020లో పెళ్లవగా, కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఇక ధనశ్రీకి చాహల్ రూ. 4.75కోట్ల భరణం చెల్లించడానికి అంగీకరించినట్లు సమాచారం. కాగా, ఈసారి ఐపీఎల్‌లో ఈ స్పిన్నర్ పంజాబ్ కింగ్స్ తరఫున బరిలోకి దిగనున్నాడు. గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్)కు ఆడిన చాహల్‌ను గతేడాది నవంబర్‌లో జరిగిన మెగా వేలంలో పంజాబ్ ఫ్రాంచైజీ ఏకంగా రూ. 18 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa