టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ మళ్లీ వార్తల్లో నిలిచారు. వీరిద్దరికీ విడాకులు అన్నప్పటి నుంచి సోషల్ మీడియా ఫోకస్ ఈ జంట మీదే ఉంది. నెట్టింట వీళ్లు ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. మొన్నామధ్య ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ.60 కోట్లు ఇస్తున్నాడనే వార్త తెగ వైరల్ అయిపోయింది. కానీ ఆ వార్తలో ఎలాంటి నిజం లేదు. తాజాగా మరోసారి వీరి భరణం వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రేమ వివాహం చేసుకున్న యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ కొంతకాలంగా దూరంగా ఉంటూ విడాకులకు అప్లయ్ చేశారు. ఫ్యామిలీ కోర్టు కౌన్సెలింగ్ నిర్వహించినా ఈ జంట విడిపోవడానికే మొగ్గు చూపింది. దాంతో కోర్టు కూడా వీరి అంగీకారం మీదే నిర్ణయం తీసుకుంది. విడాకులు ఇచ్చే సమయంలో ధనశ్రీకి భరణం కింద చాహల్ రూ.4.75 కోట్లు చెల్లిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయం ఇంకా కోర్టు బెంచ్ మీదే ఉండటంతో పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు చాహల్ దుబాయ్ వచ్చాడు. ఆ రోజు చాహల్ ఆర్జే మహ్వాష్‌తో స్టేడియంలో కనిపించాడు. చాహల్‌తో ఉన్న ఫొటోలు, వీడియోలను మహ్వాష్ నెట్టింట షేర్ చేసింది. దాంతో వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారంటూ నెట్టిల్లు కోడై కూసింది. చాహల్ బాల్ స్పీడ్ కంటే చాహల్ స్పీడ్ చాలా ఫాస్ట్ అంటూ కొందరు కామెంట్స్ చేశారు. అయితే తామిద్దరం ఎలాంటి రిలేషన్‌లో లేమంటూ మహ్వాష్ క్లారిటీ ఇచ్చింది.
మహ్వాష్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ చూసేందుకు చాహల్ వెళ్లిన మరుసటి రోజే ధనశ్రీ ఇన్‌స్టాలో స్టేటస్ పెట్టింది. ఈ మధ్య ఆడవాళ్లను నిందించడం కామన్ అయిపోయిందంటూ పోస్ట్‌లో పేర్కొంది. చాహల్-మహ్వాష్‌ను ఉద్దేశించే ధనశ్రీ ఈ పోస్ట్ చేసిందనే విషయం అందరికీ తెలిసిందే.
కోర్టులో ఇద్దరి కౌన్సెలింగ్ పూర్తయి విడాకులు కన్ఫార్మ్ అయిన తర్వాత చాహల్, ధనశ్రీ విడివిడిగా ఇన్‌స్టా స్టేటస్‌లు పెట్టారు. 'ఒత్తిడి నుంచి విముక్తి లభించింది' అని ధనశ్రీ పోస్ట్ చేస్తే, దేవుడు నన్ను చాలా సార్లు కాపాడాడు.. ఇప్పుడు కూడా అంటూ పోస్ట్ చేశాడు. మొత్తానికి 2020లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 2024 నుంచి దూరంగా ఉంటోంది. వీరి డివోర్స్‌కి కారణం మాత్రం ఇంకా తెలియలేదు.
![]() |
![]() |