ఐపీఎల్-2025 మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22న కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్‌లో కేకేఆర్, ఆర్‌సీబీ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందట. శనివారం కోల్‌కత్తాలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది అనుమానంగా ఉంది.
IMD ప్రకారం.. బిర్భూమ్, ముర్షిదాబాద్, నాడియా, తూర్పు బంధమాన్, ఉత్తర మరియు దక్షిణ 24 పరగణాలు, తూర్పు మిడ్నాపూర్ జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముంది. దీని వల్ల కోల్‌కతా ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు.. ఐపీఎల్ 2025 ప్రారంభ వేడుక కూడా గ్రాండ్‌గా జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటి దిశా పటాని, ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాల్గొని తమ ప్రదర్శనలను ఇవ్వనున్నారు. అయితే, వర్షం కారణంగా ఈ వేడుక కూడా జరుగుతుందా లేదా అనేది చెప్పలేం.
![]() |
![]() |