ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌కు టాస్ పడింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. కాగా రెండు జట్లూ కూడా ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాయి.
కాగా ఐపీఎల్ ప్రారంభ సీజన్ అయిన 2008లోనూ తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లే తలపడటం గమనార్హం. తాజాగా 18 ఏళ్లకు మళ్లీ ఇవి రెండు జట్లే తొలి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బరిలోకి దిగింది. ఇక ఐపీఎల్ పాలకమండలి ఇటీవల కొత్త రూల్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా మంచు ప్రభావాన్ని తగ్గించడం కోసం బౌలింగ్ జట్టుకు రెండో బంతి ఇవ్వనున్నారు. దీంతో ఇవాళ్టి మ్యాచ్‌లో 11 ఓవర్ల తర్వాత అంపైర్ల అనుమతితో కోల్‌కతా నైట్‌రైడర్స్ రెండో బంతి తీసుకోవచ్చు.
కాగా ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు జరిగాయి. అందులో 20 మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ విజయం సాధించింది. 14 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపొందింది.
తుది జట్లు ఇవే..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), రజత్ పాటీదార్ (కెప్టెన్), లియామ్ లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రసిక్ దార్ సలామ్, సుయాశ్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, యశ్ దయాళ్
కోల్‌కతా నైట్ రైడర్స్:
క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, అంగ్రకిష్ రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణ్‌దీప్ సింగ్, స్పెన్సర్ జాన్సెన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి
![]() |
![]() |