కూటమి ప్రభుత్వం దళితులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. మార్కాపురం భగత్‌సింగ్ కాలనీకి సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్మశాన వాటిక వద్ద జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొన్ని దశాబ్ధాలుగా 9వ వార్డు నుంచి 19వ వార్డు వరకుగల ప్రజలు శ్మశానవాటిక లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంతోమంది శ్మశానం లేక పడుతున్న ఇబ్బందులను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. అప్పట్లో తాను శ్మశానం ఏర్పాటుకు తప్పకుండా కృషి చేస్తానన్నారు. సుమారు 20 వేల మంది ప్రజలు పడు తున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రెవెన్యూ అధికారుల సహకారంతో భగత్‌సింగ్ కాలనీకి సమీపం లో నూతన శ్మశానానికి అనువైన స్థలాన్ని సేకరించామన్నారు. భవిష్యత్తులో మున్సిపాలిటీ నిధులతో శ్మశానాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు చర్చిలకు చెందిన ఫాస్టర్లు ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు దూదేకుల మస్తానయ్య, పట్టణ పార్టీ అధ్యక్షులు షేక్ మౌలాలి, కౌన్సిలర్లు నాలి కొండయ్య, కశ్శెట్టి నగేష్, దారివేముల హర్షితబాబీ, నాయకులు ధనంకుల హరిబాబు, మాజీ కౌన్సిలర్లు జవ్వాజి రాజు, చిత్తారి పెద్దన్న, ఫాస్టర్లు ఫ్రాంక్లిన్, ఆదాము, మంచా ఏలియా, ఆండ్రూస్, సామ్యేల్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |