అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హుకుంపేట మండలం కొట్నాపల్లి వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు మృతి చెందారు. దంపతులు కొట్నాపల్లిలోని చర్చికి వెళ్లొస్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను డుంబ్రిగూడ మండలం పాములపుట్టకు చెందిన గెమ్మేలి నూకరాజు, దొశూదగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్ మద్యం మత్తులో లారీ నడిపినట్లు హుకుంపేట సీఐ సన్యాసినాయుడు తెలిపారు.
![]() |
![]() |