కడప జిల్లా, చాపాడు మండలంలోని పల్లవోలు గ్రామంలో ఆదివారం అంకాళమ్మ తిరుణాళ్ల సందర్భంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీల్లో మైదుకూరు ఎడ్లు మొదటి బహుమతి సాధించాయి. ఈ పోటీల్లో మైదుకూరుకు చెందిన వెంకటేష్‌యాదవ్ ఎద్దులు 1415 అడుగుల లాగి మొదటి బహుమతి రూ.లక్ష గెలుచుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రొద్దుటూరు టౌన్ వైఎంఆర్ కాలనీకి చెందిన ద్వార్శల గురివిరెడ్డి ఎద్దులు 1400 అడుగులు లాగి రెండవ బహుమతి రూ.80 వేలు, ప్రొద్దుటూరు మండలం రంగసాయిపురం గ్రామానికి చెందిన మార్తల వెంకటసుబ్బారెడ్డి ఎద్దులు 1119 అడుగులు లాగి మూడో బహుమతి రూ.60 వేలు గెలుచుకున్నట్లు వారు పేర్కొన్నారు. కాగా అంకాళమ్మ తిరుణాళ్ల అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ప్రొద్దుటూరు, మైదుకూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, కేసీకెనాల్ వైస్‌ఛైర్మన్ ద్వార్శల గురివిరెడ్డి, టీడీపీ నాయకులు, రామమోహన్, రామాంజనేయులు, మిల్లు శ్రీనివాసులు, వెంకటసుబ్బారెడ్డి, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.
![]() |
![]() |